*వెల్డింగ్ గ్యాస్ పేలి ఇద్దరు మృతి ముగ్గురికి గాయాలు.*
*వెల్డింగ్ గ్యాస్ పేలి ఇద్దరు మృతి*
*- మరో ముగ్గురికి గాయాలు*
కుప్పం:
కుప్పం మండల పరిధిలోని తంబిగానిపల్లి సమీపంలో ఓ గ్యాస్ వెల్డింగ్ షాప్ లో వెల్డింగ్ చేస్తుండగా సిలిండర్ పేలిన ఘటన ఆదివారం చోటుసుకుంది.స్థానికుల కథనం మేరకు వివరాలు.సమీపంలోని గ్రానైట్ పరిశ్రమకు చెందిన క్రేన్ కు వెల్డింగ్ చేస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.ఆ సమయంలో మొత్తం 5 మంది అక్కడ ఉన్నట్టు సమాచారం.అందులో ఇద్దరు అక్కడిక్కకడే మరణించగా, గాయపడిన మరో ముగ్గురు మంజునాథ్(29), గౌస్(32), బాషా(42) లను కుప్పం ఏరియా ఆస్పత్రికి తరలించారు.మంజునాథ్ స్వల్ప గాయాలతో బయటపడగా, తీవ్రంగా గాయపడిన ఇద్దర్ని పి ఈ ఎస్ ఆసుపత్రికి తరలించారు.అక్కడ సర్జన్ లు అందుబాటులో లేకపోవడంతో బెంగళూరుకు రెఫెర్ చేశారు.సంఘటనా స్థలంలో మృతిచెందిన వారు ఏజాజ్, అప్సర్ లు గా గుర్తించారు.వీరు ఇరువురు కుప్పం మండలం రాగిమానుమిట్ట గ్రామానికి చెందిన వారుగా సమాచారం.*
*ఈ రోజు వార్త*
Comments
Post a Comment