ఆమ్ ఆద్మీ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభించిన తిరుపతి జిల్లా కన్వీనర్
చంద్రగిరిలో ఆమ్ ఆద్మీ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభించిన తిరుపతి జిల్లా కన్వీనర్ నీరుగట్టు నగేష్
ఈ రోజు తిరుపతి జిల్లా చంద్రగిరి టౌన్ టవర్ క్లాక్ వద్ద చంద్రగిరి నియోజకవర్గ కన్వీనర్ విరుపాక్షి నవీన్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగింది .ఈ కార్యక్రమానికి ప్రారంభానికి ముఖ్య అతిధులుగా జిల్లా కన్వీనర్ నీరుగట్టు నగేష్ విచ్చేసి ప్రారంభించారు.ఈ సందర్భముగా నీరుగట్టు నగేష్ మాట్లాడుతూ ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీ మరియు పంజాబ్లో అవినీతిలేని నీతివంతమైన పాలనతో ప్రజలకు అందిస్తున్న సేవలలను దేశ ప్రజలంతా స్వాగతిస్తున్నారన్నారు.పార్టీ లోకి పలువురు స్వచ్చందంగా చేరారు హిజ్రాలు కూడా ఈరోజు మేముసైతం ఆమ్ ఆద్మీ పార్టీలో సభ్యులుగా చేరుతాము అని సభ్యత్వం తీసుకోవడం చంద్రగిరి ప్రాంత ప్రజల్లో చర్చనీయాంశం అయింది .ఈసారి చంద్రగిరి నియోజకవర్గంలోని ప్రజలు మార్పు కోరుకుంటున్నారని తెలిపారు.పార్టీలో చేరుటకు టోల్ ఫ్రీ నెంబర్ 18001497874 కు కాల్ చేసి కూడా సభ్యులుగా చేరవచ్చు అన్నారు.అనంతరం చంద్రగిరి నియోజకవర్గ కన్వీనర్ విరుపాక్షి నవీన్ రెడ్డి మాట్లాడుతూ ఈ నాటి నుండి ప్రతిగడపకు ప్రజాబాట ద్వారా సభ్యత్వ నమోదు చేపడుతామని తెలిపారు. అలాగే మండల,పంచాయతీ ,బూత్ స్థాయిలో పార్టీ బలోపేతం కొరకు నాయకత్వ భాద్యతలు చేపట్టుటకు ముందుకు రావాలన్నారు.ఈ కార్యక్రమంలో తిరుపతి నియోజకవర్గ కన్వీనర్ టి.జయ కుమార్,స్థానిక నాయకులు డి.జె.నవీన్ ,ప్రదీప్,రాజేష్,హరిబాబు,సురేష్, గురురాజ్ తతితరులు పాల్గొన్నారు.
Comments
Post a Comment